చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండ రాజయ్య
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 13(కలం శ్రీ న్యూస్):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ కుట్ర పూరితంగా మాజీ ముఖ్యమంత్రి నారచంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టుచేసినందుకు నిరసనగా మంథని నియోజకవర్గ కేంద్రంలో మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండే రాజయ్య నిరసన తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని ప్రపంచ దేశాలు మెచ్చుకున్నా నాయకుడు అని వారు కొనియాడారు గత పాలకులు తెలుగుదేశం పార్టీతో పెట్టుకొని కాలగర్భంలో కలిసిపోయారు చరిత్రను చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎందుకు హెచ్చరిస్తున్నామంటే మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీతో తలపడ్డాడు కాలగర్భంలో కలిసిపోయారు.ప్రపంచ దేశాలు మిమ్ముల క్రిమినల్ రాజకీయ నాయకుడని ఏలెత్తి చూయించే వ్యవస్థను చూసి ఓర్వలేక నీలాంటి అహంకారం ఉన్న నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టకరం ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు మట్ట శంకర్ యువత అధ్యక్షులు బడుగు మహేష్ పాల్గొన్నారు.