పీఓపి విగ్రహాలపై యూత్ కాంగ్రెస్ అవగాహన ర్యాలీ
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్ ):వినాయక చవితి సందర్భంగా మనం పూజించే వినాయక విగ్రహాలను పీఓపి విగ్రహాలు కాకుండా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మట్టి విగ్రహాలు పూజించాలని కోరుతూ మంథని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మంథని జూనియర్ కాలేజ్ నుండి విద్యార్థులతో ర్యాలీగా వస్తూ మంథని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో పిఓపి విగ్రహాల పై అవగాహన కల్పించారు.పీఓపి విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతుందని, కావున ప్రజలందరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కోరారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంట్లో పూజించుకునే చిన్న మట్టి విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా పంపిణి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అయిలి ప్రసాద్,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి బండ కిషోర్ రెడ్డి, బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జీ,మున్సిపల్ కౌన్సిలర్ పేండ్రు రమ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు,కాంగ్రెస్ మండల మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ అలీమ్,పట్టణ అధ్యక్షుడు ఎజాస్, ఖానాపూర్ మాజీ సర్పంచ్ దోరగార్ల శ్రీనివాస్,ఎన్ఎస్ యు ఐ నియోజకవర్గ ఇన్చార్జి ఎండి. ఖాజా మొయినుద్దీన్,ఐవైసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేష్,కెక్కర్ల సందీప్ గౌడ్,తేజ పటేల్,కొండ మహేందర్,నితీష్,మోహన్, కాంగ్రెస్ నాయకులు కొఠారి బాపు. పర్వతాలు యాదవ్, బండారి ప్రసాద్ మాజీ సర్పంచ్ మంథని కర్ణ కృష్ణ, షంషీర్ అలీ, నరెడ్ల కిరణ్, అడ్లురి సమ్మయ్య,మస్కుల రాజిరెడ్డి,అహెసన్,అక్కపాక సదయ్య ,జనగామ సడవలి.పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా చైర్మెన్ ఆరెళ్ళి కిరణ్ గౌడ్, పంచిక దేవేందర్,గుంజ సతీష్. పోగుల సాగర్,మంథని సమ్మయ్య,విద్యార్థులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.