బిఆర్ఎస్ లో చేరికలు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్):కాటారం మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీ లోకి చేరగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృధ్ది,ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం, మధన్నగెలుపు ఖాయమని వారు తెలిపారు.