Saturday, July 27, 2024
Homeతెలంగాణ40ఏండ్లలో జరుగని అభివృధ్దిని నాలుగేండ్లలో చేసి చూపించాం

40ఏండ్లలో జరుగని అభివృధ్దిని నాలుగేండ్లలో చేసి చూపించాం

40ఏండ్లలో జరుగని అభివృధ్దిని నాలుగేండ్లలో చేసి చూపించాం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్  

 మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్):ఎన్నికల కమీషన నియమావళి ప్రకారం ఇచ్చిన మూడు కలర్లపార్టీకి ప్రజలు 40ఏండ్లు అవకాశం ఇస్తే ఏం చేసిండ్లో ఆలోచన చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు.కాటారం మండల కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లా పరిషత్‌చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40ఏండ్లు మనం ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెడితే ఏనాడు మన గురించి ఆలోచన చేయలేదని, అలాంటి ఒకే కుటుంబానికి ఓట్లు వేసినోళ్లు ఈనాడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్లు ఉంటే ఎలా ఉంటుందో ఈనాటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. ఒకప్పుడు ఆస్పత్రులు ఉంటే వైద్యులు ఉండేవారు కాదని, వైద్యులు ఉంటే వసతులు ఉండేవి కావని కానీ ఈనాడు వైద్యులు లేని వసతులు లేని ఆస్పత్రులు ఎక్కడా లేవన్నారు. ఆనాడు మన ఆరోగ్యం గురించి ఆలోచన చేయకుండా కనీసం వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయకుండా వాళ్లు మాత్రం అమెరికాకు పోయి మంచి వైద్యం చేయించుకుని ఆనందంగా ఉన్నారే కానీ ఏనాడు మన గురించి పట్టించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.40ఏండ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌పార్టీకి, ఒక్క కుటుంబానికే కాటారం మండల ప్రజలు మెజార్టీ ఇచ్చే వారని కానీ ఓట్లు వేసిన ఇక్కడి ప్రజలకు మాత్రం వాళ్లు చేసింది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరిలో కూడా ఏమీ చేయకుండా ఎన్నికల్లో ఓట్లు దండుకున్న చరిత్ర ఒక్క కుటుంబానికే దక్కుతుందని విమర్శించారు.కానీ ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన తాము ఏనాడు ప్రజలను మర్చి పోలేదని, ప్రజల గురించే ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు. గత రెండు మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఏమీ చేయని ఒక్క కుటుంబానికి మెజార్టీ ఇచ్చారే తప్ప ఇంత అభివృధ్ది చేసిన తమ గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. తమకు ఓట్లు వేశారా లేదా అని ఏనాడు చూడలేదని,ఇక్కడి ప్రజలకు మంచి వైద్యం, చదువులు అందించాలని చూశామన్నారు. ఓడిపోయినా కాటారం మండలంలో ఎంతో అభివృధ్ది చేశామనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లుచేశామని, అంబులెన్స్‌లుపెట్టామని, పేదింటి బిడ్డలకు చదువులు చెప్పించామని ఆయన గుర్తుచేశారు. మంచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, అదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి ముందుచూపుతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.ముఖ్యంగా పేద వర్గాల ఆరోగ్యం గురించి గొప్పగా ఆలోచన చేస్తన్నారని,ఇందులో బాగంగానే ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మహిళల ఆరోగ్యం కోసం వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే 40ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనోళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో మంజూరైన డయాలసిస్‌ కేంద్రం ఇంకా ప్రారంభించడం లేదని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.మంచి సంకల్పంతో అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే అర్థరహితమైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కాటారం మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మిచెక్కులు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చి 20రోజులుగడుస్తున్నా ఇంకా ఎందుకు లబ్దిదారులకు అందించడం లేదని ప్రశ్నించారు. విమర్శలు చేయడానికి దొరికిన సమయం లబ్దిదారులకు చెక్కులు పంచడానికి దొరుకడం లేదా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన చెక్కులు ఓ వైపు పంచుతూ మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు పథకాలు రాని కాడ మాత్రం మాకు సంబంధం లేదంటూ దాటవేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వాళ్ల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనస్పుంటే మార్గ ముంటుందని పెద్దలు చెప్పినట్లుగా నిత్యం ప్రజల గురించి ఆలోచన చేస్తున్న తాము సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మంథని నియోజకవర్గంలో 40ఏండ్లలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం,పాలకులు చేయని అభివృధ్దిని చేసి చూపించామని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!