బోనమెత్తిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్):కమాన్ పూర్ మండలం శాలపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఉత్సవాల సందర్బంగా నెత్తిన బోనమెత్తుకుని ప్రదర్శనగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని, అమ్మవారి ఆశీస్సులతో మంథని ప్రాంత ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఈ సందర్బంగా వేడుకున్నట్లు తెలిపారు.