Wednesday, September 18, 2024
Homeతెలంగాణతపాల శాఖ గుడ్ న్యూస్...

తపాల శాఖ గుడ్ న్యూస్…

తపాల శాఖ గుడ్ న్యూస్…

పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు 

మార్చి 31వరకు వర్తింపు…

కొత్త వడ్డీ రేట్లతో ఈ నెల 28న స్పెషల్ క్యాంపెన్

సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ పిలుపు…

 

 

పెద్దపల్లి, జనవరి 25 ( కలం శ్రీ న్యూస్):

నిత్యం ప్రజలతో మమేకమయ్యే తపాల శాఖ వారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు పలు పథకాల వడ్డీ రేట్లను భారీగా పెంచింది. జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. కొత్త వడ్డీ రేట్లతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న స్పెషల్ క్యాంపెన్ నిర్వహిస్తున్నది. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి డివిజన్ ఇన్చార్జీ పోస్టల్ సూపరిండెంట్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు పథకాలు మినహా తపాల శాఖలో ఉన్న పథకాల వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ఈ పెంచిన వడ్డీ రేట్లు మార్చి 31వరకు వర్తిస్తాయని వివరించారు. ఈ కొత్త వడ్డీ రేట్లను ప్రజలకు వర్తింపచేయాలనే లక్ష్యంతో ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్టాఫీసులలో స్పెషల్ క్యాంపెన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులలో సంప్రదించాలని పోస్టల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రకటనలో కోరారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!