పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్):కమాన్ పూర్ మండలం లోని పెంచికల్ పేట్, కమాన్ పూర్, గుండారం గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ ఇటీవలే మరణించిగా వారి కుటుంబాన్ని, అదే గ్రామానికి చెందిన కుంభం రవి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, కమాన్ పూర్ మండలకేంద్రానికి చెందిన చిప్పకుర్తి రమేష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని, గుండారం గ్రామానికి చెందిన రాచకొండ ప్రేమ్ సాగర్ ఇటీవలె మరణించిగా వారి కుటుంబాన్ని, మరియు అదే గ్రామనికి చెందిన పరకాల తిరుపతి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి,అండగా ఉంటానని తెలియజేశారు.వారి వెంట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.