గ్రామ దేవతల దీవెనతో ప్రజలు సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్ ):కమాన్ పూర్ మండలంలోని సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోగల శాల పల్లెలో నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు పోచమ్మ తల్లి బోనాలు కార్యక్రమానికి సునీల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి విరాళం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామదేవతలైన పోచమ్మ దీవెనలతో మంథని ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఎల్లప్పుడు వర్ధిల్లాలని,గ్రామదేవతల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని మన హిందూ ధర్మం చాలా గొప్పదని మన సనాతన ధర్మంలో పండుగలకు, బోనాలకు మిగతా కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యమిచ్చారని,అలాగే మనం చెట్టును పుట్టను ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుని లాగా దేవతలాగా పూజిస్తామని మన సనాతన ధర్మం చాలా గొప్పదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు జంగాపల్లి అజయ్, బిజెపి సీనియర్ నాయకులు మచ్చ గిరి రాము, మండల ప్రధాన కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, కొయ్యడ సతీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అలుగు కృష్ణవేణి, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జంగపల్లి శేఖర్, నాయకులు ఇరుగురాల భాను ప్రకాష్,శాలపల్లి గ్రామ ప్రజలు, మహిళలు, యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.