Sunday, December 10, 2023
Homeతెలంగాణతెలంగాణ లో ఎన్నికలు వాయిదా పడొచ్చు..మంత్రి కేటీఆర్

తెలంగాణ లో ఎన్నికలు వాయిదా పడొచ్చు..మంత్రి కేటీఆర్

తెలంగాణ లో ఎన్నికలు వాయిదా పడొచ్చు..మంత్రి కేటీఆర్

హైదరాబాద్,సెప్టెంబర్12(కలం శ్రీ న్యూస్): తెలంగాణ ఎన్నికల నిర్వహణపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే కష్టమే అని వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంట్ సెషన్స్ అయిపోతే ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీ ఎన్నికలకు భయపడుతున్నాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే అయిదు రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో ఒక్క దగ్గరే బీజేపీకి అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తే తమకే మంచిదని అన్నారు . తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను ప్రజలు నమ్మరని,వీళ్లిద్దరి వెనుక సీమాంధ్రులు ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు సెట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!