Thursday, September 19, 2024
Homeతెలంగాణక్రీడా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ 

క్రీడా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ 

క్రీడా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ 

సుల్తానాబాద్, సెప్టెంబర్ 12 (కలం శ్రీ న్యూస్ ) : ఎస్‌జిఎఫ్ అండర్ 14, 17 మండల స్థాయి క్రీడా పోటీలను స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని సెయింట్ మేరీస్ స్కూల్ ప్రాంగణంలో పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించారు. సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ మండల కన్వీనర్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, 17 బాలికల ఎస్‌జిఎఫ్ మండల స్థాయి కబడ్డీ,వాలీబాల్, కోకో క్రీడా పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలలో ఆసక్తి కనబరిచి రాణించాలని కోరారు. క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం, ఆరోగ్యం, దృఢంగా ఏర్పడుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్,స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, మాజీ ఎంపిటిసి సూర శ్యామ్, సెయింట్ మేరీస్ పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు మహేందర్, సంధ్య , జ్యోత్స్య, మణిమాల, సునీత ,వెంకటలక్ష్మి, సరోజ , సంపత్ ,సత్యం ,శివ ,ఇక్బాల్ ,ప్రవీణ్, నవీన్ విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!