Thursday, April 18, 2024
Homeతెలంగాణఈ ప్రాంత ప్రజలు గౌరవంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష

ఈ ప్రాంత ప్రజలు గౌరవంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష

ఈ ప్రాంత ప్రజలు గౌరవంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని సెప్టెంబర్ 10 (కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలు గౌరవంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష అని మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

మంథని పట్టణంలోనీ పవర్‌హౌజ్‌ కాలనీలో ఇల్లు లేని వారు అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేలా పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ముక్తీ ఆశ్రమమ్‌,విశ్రాంతి భవనాన్ని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో అనేక మంది సొంత ఇల్లు లేక ఇంట్లో వారు చని పోతే దహన సంస్కారాలు చేయడానికి బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆచార వ్యవహారాల పేరుతో ఇంటి యజమానులు ఇబ్బందులు పెట్టే సంఘటనలు తాము కళ్లారా చూశామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది కోటీశ్వర్లు సైతం తమ చివరి క్షణాల్లో ఆర్థికంగా చితికి పోయి సొంత ఇల్లు లేక వారి దహన సంస్కారాలు చేయడానికి బంధువులు ఎన్నో ఇబ్బందులు పడ్డ సంఘటనలు సైతం చూసి చలించి పోయామన్నారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలు అలాంటి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతో తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ముక్తి ఆశ్రమమ్‌,విశ్రాంత భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ముక్తి ఆశ్రమాన్ని పేద ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గౌరవంగా బంధువుల దహన సంస్కార కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చన్నారు. కేవలం కరెంట్‌ బిల్లు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో ఆ డబ్బులు మాత్రం చెల్లిస్తే సరిపోతుందన్నారు. పేద ప్రజలు ఆ కరెంట్‌ బిల్లు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తన చిన్న తనంలోనే తల్లిని.యువకుడిగా ఉన్న సమయంలో తండ్రి కోల్పోయానన్నారు. అనాథులుగా ఉండే వారి కష్టాలు నాకు తెలుసన్నారు. అందుకే నియోజకవర్గంలో ఎవరు కూడా తాము అనాథలం అని బాధపడ వద్దనే ఉద్దేశ్యంతో తాము ఉండే ఇల్లు లాగా నిర్మించి ముక్తి ఆశ్రమమ్‌, విశ్రాంత భవనం ఏర్పాటు చేశామన్నారు. ఇకపై నియోజకవర్గంలోని పేదల ప్రజలందరికీ మంథనిలో మాకు ఒక ఇల్లు ఉంది.. మాకు ఒక కుటుంబం ఉంది.. అది పుట్ట మధూకర్‌ కుటుంబం..అనే ఆలోచనే ఉండాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగణంగా నియోజకవర్గంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతీ గ్రామంలో వైకుంఠ దామాలను ఏర్పాటు చేస్తుండగా తాను అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు వీలుగా మంథనిలో ముక్తి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశానన్నారు. పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ముక్తి ఆశ్రమమ్‌, విశ్రాంత భవనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఇది నా కుటుంబం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యంగా తాను భావిస్తున్నానన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!