పలు కుటుంబాలను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 10( కలం శ్రీ న్యూస్): మంథని నియోజకవర్గం లోని పలు కుటుంబాలను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ.ఆదివారం మంథని మండలం మల్లేపల్లి గ్రామంలో జాబు రాధ మరణించగా వారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ముత్తారం మండలం హరిపురం గ్రామంలో ఇటీవల మరణించిన ఎజ్జ కనుకమ్మ కి నివాళులు అర్పించారు.మంథని పట్టణంలోని 8వ వార్డు పోచమ్మ వాడలో అనారోగ్యంతో బాధపడుతున్న గడి రాజయ్య,ముడతనపల్లి చంద్రయ్య,ముడతనపల్లి మధు లను పరామర్శించారు.మంథని మండలం అక్కెపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గోవిందారపు కమల ను పరామర్శించారు.