Saturday, July 27, 2024
Homeతెలంగాణఅంగన్వాడి ఉద్యోగుల సమ్మె పట్ల అధికారుల బెదిరింపులు ఆపాలి

అంగన్వాడి ఉద్యోగుల సమ్మె పట్ల అధికారుల బెదిరింపులు ఆపాలి

అంగన్వాడి ఉద్యోగుల సమ్మె పట్ల అధికారుల బెదిరింపులు ఆపాలి

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 9 (కలం శ్రీ న్యూస్ ):అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆగస్టు 18న రాష్ట్ర మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు అంగన్వాడి ఉద్యోగులు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పి అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను విచ్చిన్నం చేయాలని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారితో పర్సనల్ వ్యక్తిగత లేఖలు రాయించుకొని మీ ఉద్యోగాలు తీసివేస్తామని సెంటర్ తాళాలు అధికారులకు ఇచ్చివేయాలని తాళాలు ఇవ్వకుంటే మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. దీన్ని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఖండిస్తున్నది. ప్రాజెక్టు అధికారులు అంగన్వాడి ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి బలవంతంగా సంతకాలు చేయించడానికి జరిగిన ప్రయత్నాన్ని యూనియన్ అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈ వనజారాణి కృష్ణకుమారి, సిఐటియు జిల్లా నాయకులు బి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!