బిట్టుపల్లి యువత జనసేన లో చేరిక
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 9 (కలం శ్రీ న్యూస్): మంథని నియోజక వర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బిట్టుపల్లి గ్రామ యువత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు,జనసేన పార్టీ ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా నియోజక వర్గ ఇంఛార్జి మాయ రమేష్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. మాయ రమేష్ మాట్లాడుతూ రేపటి మంచి రోజుల కోసం నేడు మనందరం కలిసికట్టుగా శ్రమిస్తే రాబోవు తరాలకు దర్మపాలన అందిద్దాం అని పిలుపునిచ్చారు. యువతకు ఇదే సదవకాశం మీ మండల పరిధిలోని ప్రతి సమస్యను పూర్తిగా అవగాహన చేసుకొని అందుకు తగిన చర్యలు ఎలా చెయ్యాలో ప్రణాళికాబద్దంగా అందరం కలిసి ముందుకు సాగుదాం అని తెలియచేశారు. జనసేన పార్టీ లో ప్రతి సభ్యుడు బాధ్యతగా ఉండి క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి ముందుండి నడుస్తారు అని ఆశిస్తున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమం కు ప్రత్యేక అతిధి గా వచ్చిన చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదములు తెలియచేశారు.జనసేన పార్టీలో చేరిన సభ్యులు కాసు రంజిత్ ,అనిల్ ,శ్రీధర్,అభిషేక్,సంతోష్,జెశ్వంత్,రవీందర్,అనిల్,సాయి,అవినాష్,శ్రీకాంత్,శ్రీరామ్ ,మనిశ్వర్,జెస్వంత్ తదితరులు పాల్గొన్నారు.