బీఆర్ఎస్ లో చేరికలు
మంథని, రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 9( కలం శ్రీ న్యూస్ ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ముత్తరం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు నూతన ఓటర్లు శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆయన వెంట ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య,జెడ్పిటిసి చెల్కల స్వర్ణలత అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, కేషన్ పల్లి సర్పంచ్ నూనె కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రమణ రెడ్డి, కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సమ్మయ్య లతోపాటు పలువురు ఉన్నారు..