చాకలి ఐలమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయండి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 9( కలం శ్రీ న్యూస్): దౌర్జన్యాలతో అణచివేయాలని చూసిన దొరలు,భూస్వాములపై ఎదురు తిరిగి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సభను మంథని పట్టణంలోని చాకలి ఐలమ్మ చౌక్ లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్ పోతరాజు సమ్మయ్య, కో-కన్వీనర్లు అంకరి కుమార్, తగరం శంకర్ లాల్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ శనివారం వేర్వేరుగా తెలిపారు.ఐలమ్మ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్ష కల సహకారం కావడానికి పోరాట స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సభకు మంథని నియోజకవర్గంలోని ఐలమ్మ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు,బడుగు బలహీన వర్గాల శ్రేణులు,రజకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.