మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
సుల్తానాబాద్,సెప్టెంబర్06(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాల్వ నారాయణ(శ్రీరాములపల్లి )అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబానికి మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ 10,000 రూపాయలను మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్థిక సహాయముగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని, మృతిని కుటుంబానికి మున్సిపల్ కార్యాలయం తరఫున అండగా ఉంటామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుండి పదివేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పసెడ్ల మమత సంపత్, మృతుని కుటుంబ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తో పాటు పలువురు పాల్గొన్నారు.