ఐపీఎస్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
సుల్తానాబాద్,సెప్టెంబర్ 5 (కలం శ్రీ న్యూస్ ): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవం, ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్,ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియా మాట్లాడుతూ దేశ తొలి ఉప రాష్ట్రపతి,రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ సేవలందించారని గుర్తు చేసుకు న్నారు. ఆయన జన్మించిన సెప్టెంబర్ 5వ తేదీని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.తన పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు,ఉపాధ్యాయ దినోత్స వంగా నిర్వహిస్తే తానెంతో గర్విస్తానని చెప్పిన సర్వేపల్లి ఉపా ధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారన్నారు.అదేవిధంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.చిన్నారులందరు రాధాకృష్ణ వేషధారణలో కళ కళ లాడుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు.విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మాననించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.