Saturday, July 27, 2024
Homeతెలంగాణఅవకాశం ఇచ్చిండ్లు అభివృధ్ది చేసి చూపించా

అవకాశం ఇచ్చిండ్లు అభివృధ్ది చేసి చూపించా

అవకాశం ఇచ్చిండ్లు అభివృధ్ది చేసి చూపించా

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని సెప్టెంబర్ 5 (కలం శ్రీ న్యూస్ ):ఆనాడు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా, ఈనాడు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే అభివృధ్ది చేసి చూపించామని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని రాజగృహాలో కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎమ్మెల్యే ఉన్న సమయంలో రాజాపూర్‌ వాసులు అనేక పనులు కావాలని తన దృష్టికి తీసుకువచ్చారని, గుడి కావాలని, మంగపేట రోడ్డు కావాలని కోరడంతో ఆనాడు రూ.3కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే సమయం సరిపోక ఆ పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆ తర్వాత మంథని నియోజకవర్గ ప్రజలు అన్నం పెట్టటోళ్లను వద్దని చెంచడు నీళ్లు పోయనోళ్లను గెలిపించుకున్నారని ఆయన వాపోయారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అనేక పనులు చేసినా తనను వద్దనుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏదో చేస్తాడని ఓట్లు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఐదేండ్లుగా తన ప్రభుత్వం లేదని, తాను ఏమీ చేయలేనంటూ కాలం వృధా చేశారని ఆయన గుర్తుచేశారు.ప్రజలు ఆలోచన చేయకుండా మాయ మాటలునమ్మి ఓట్లేయడం మూలంగా అభివృధ్దిలో ఐదేండ్లు వెనుకబడిపోయామని ఆయన అన్నారు. మన కోసం మన ఆకలి తీర్చాలని ఆలోచన చేసేవాళ్ల గురించి ఆలోచన చేయాలని, ఓట్లు వేసే ముందు ఆలోచన చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఐదేండ్లు అధికారంలో ఉంటూ ఏమీ చేయనోళ్లను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, ఆనాడు మా మధన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్నం పెట్టి ఆకలి తీర్చిండు, మా బిడ్డలకు చదువులు చెప్పించిండు, ఆస్పత్రుల్లో చూపిండు,మా బిడ్డల పెండ్లిళ్లు చేసిండు మీరు ఎందుకు చేయడం లేదని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.అనేక ఏండ్లు పాలించిన కాంగ్రెస్సోళ్లు నియోజకవర్గానికి ఏం చేసిండ్లో చెప్పరని,ఏం చేస్తారో చెప్పరని ఆయన ఎద్దేవా చేశారు. అసలు వాళ్లు చెప్పుకోవడానికి ఏమీ లేకనే మాయమాటలతో మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంథనిలో ఇంత పెద్ద ఇళ్లు కట్టిన తాను నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచన చేశానని, కానీ మంథని, ధన్వాడ, హైదరబాద్‌లో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిన ఎమ్మెల్యే ఎవరికైనా సాయం చేయాలనే ఆలోచన చేస్తుండా అని ఆయనప్రశ్నించారు. కనీసం ఆయన ఇంటికి పోతే పలుకరించే వారే ఉండరని,అసలు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియని దుస్థితి అని ఆయన అన్నారు. కానీ తాను మంథనిలో కట్టించిన ఇంటిలో తాను లేకపోతే తన సతీమణి అందుబాటులో ఉంటుందని, ఇద్దరం లేకపోతే మా పీఏ అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటారని, అంతేకాకుండా మా ఇంటిలో ఎంత సమయమైనా ఉండే అవకాశం ఉంటుందే కానీ సారు ఇంట్లో నిమిషమైనా ఉండనిస్తారా అని ఆలోచన చేయాలన్నారు. మన ఆకలి, కష్టాలు తీర్చాలని ఏనాడు ఆలోచన చేయరని, ఎలా కుట్రలు, కుతంత్రాలు చేయాలే ప్రజలను ఎలా దూరం చేయాలనే ఆలోచన చేయడం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే వాళ్ల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు గొప్పగా ఆలోచన చేసి మన కోసం ఆలోచన చేసే వారికి అండగా నిలువాలని,ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!