Tuesday, October 8, 2024
Homeతెలంగాణస్వర్ణకారుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన నల్ల

స్వర్ణకారుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన నల్ల

స్వర్ణకారుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన నల్ల

పెద్దపల్లి,సెప్టెంబర్04(కలం శ్రీ న్యూస్):రాష్ట్ర స్వర్ణకారుల సంఘం పిలుపుమేరకు స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరియు హక్కులను సాధించుకోవడానికి సోమవారం పెద్దపల్లి పట్టణంలోని మస్జీద్ చౌరస్తాలో చేస్తున్న ఒకరోజు నిరాహారదీక్షలకు పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్ నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తులకు మంచిరోజులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన స్వర్ణకారుల ప్రభుత్వం మొసంచేస్తున్నది, కులవృత్తిని నమ్ముకొని జీవించే వారిపై కార్పొరేట్ జ్యూవెల్లరి షోరూంలు ఏర్పాటు చేయడం ద్వారా కులవృత్తిని నమ్ముకునే స్వర్ణకారుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

స్వర్ణకారులు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఆమోద యోగ్యమైనవని, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని లేని పక్షంలో పోరాటం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నల్ల మనోహర్ రెడ్డి  తెలిపారు.అదేవిధంగా ఈనెల 17న విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరారు.

ఈకార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!