Tuesday, October 8, 2024
Homeతెలంగాణమహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేయాలే

మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేయాలే

మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేయాలే

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 4 (కలం శ్రీ న్యూస్):మహిళలు ఆర్థికస్వావలంభన దిశగా అడుగులు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృధ్ది సంస్థ ఆధ్వర్యంలో గౌతమి మండల సమాఖ్య సౌజన్యంతో మంథని మండలం విలోచవరం గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ సంఘ సభ్యురాలు జానగిరి శృతికి రూ.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పిండి గిర్నిని జిల్లా అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆర్థికాభివృధ్దికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ చేయూతనందిస్తున్నారని అన్నారు.మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుని ఆర్థికంగా ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు.గత ప్రభుత్వాలు ఏనాడు మహిళల ఆర్థికాభివృధ్దిని పట్టించుకోలేదని,మహిళల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు.ప్రతి మహిళ ప్రభుత్వం అందించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను మహిళా సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్,ఎంపీడీవో రమేష్, రైతుబంధు అద్యక్షులు ఆకుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!