బీఆర్ఎస్లో పలువురి చేరిక
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 3 (కలం శ్రీ న్యూస్ ):బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.గత రెండు రోజులుగా మంథని ముత్తారం మండలాలకు చెందిన అనేక మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తాజాగా మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృధ్ది, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం,మధన్న గెలుపు ఖాయమని వారు తెలిపారు.