Thursday, September 19, 2024
Homeతెలంగాణస్వర్ణపల్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

స్వర్ణపల్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి

స్వర్ణపల్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి

జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు గ్రామస్తుల వినతి

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్  

మంథని సెప్టెంబర్ 3 (కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని స్వర్ణపల్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసేందుకు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను గ్రామస్తులు కోరారు.ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో స్వర్ణపల్లి గ్రామస్తులు జెడ్పీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనేక సంవత్సరాలుగా తమ గ్రామం నాగేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనే ఉంటుందని,ప్రత్యేక గ్రామపంచాయతీ కాకపోవడంతో అభివృధ్దిలో వెనుకబడిపోయిందన్నారు. నాగేపల్లి గ్రామపంచాయతీకి తమ గ్రామం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, సుమారు 500పైచిలుకు జనాభా ఉన్న తమ గ్రామం గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిపాలన సౌలభ్యం కల్పించేలా నూతన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రంలో కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!