గణేష్ ఉత్సవ కమిటీ నియామకం
సుల్తానాబాద్,సెప్టెంబర్03(కలం శ్రీ న్యూస్):
ఆదివారం సుల్తానాబాద్ ఉదయం పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి రానున్న “గణేష్ నవరాత్రి ఉత్సవాల” నిర్వహణ , ఏర్పాట్ల గురించి చర్చించిన అనంతరం గణేష్ నగర్ నూతన ఉత్సవ కమిటీ ని సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా గుర్రాల శంకరయ్య, అధ్యక్షులుగా మాటేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా నల్ల శ్రీనివాస్, ముఖ్య సలహాధారులుగా పడాల శ్రీరాములు, ఉత్సవ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దీకొండ భూమేష్ కుమార్, రాజు, లింగయ్య, సంపత్, రామరావు, సమ్మయ్య, శ్రీనివాస్, వెంకటేశం, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.