యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరం : ఏసీపీ ఎడ్ల మహేష్
సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత యోగ శిక్షణ
సుల్తానాబాద్,సెప్టెంబర్03(కలం శ్రీ న్యూస్):
యోగాతో మానవాళి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పెద్దపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్ అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మహిళలు, యువత, వృద్ధులు, విద్యార్థిని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ యోగ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, ఆయుర్వేదం, ధ్యానం పై అవగాహన, ఉచిత శిక్షణ కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈసందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ….యాంత్రిక జీవనంలో మనం అనేక రకాల ఒత్తిళ్లకు, అనారోగ్యాలకు గురవుతున్నామని, యోగా, ధ్యానంతో వీటన్నింటి నుంచి దూరమై ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని ఏసీపీ ఏడ్ల మహేష్ అన్నారు. దీంతో అనేక రోగాలను తగ్గించుకోవడంతోపాటు నియంత్రించుకోవచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు అనేక దేశాలు, ప్రభుత్వాలు యోగా కు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. యోగ, ధ్యానాన్ని రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలి అని తెలిపారు. ఒత్తిడి సమయంలో యోగ ప్రక్రియ మానసిక ప్రశాంతత కోసం చాలా ఉపయోగపడుతుందని, నిత్య జీవితంలో యోగ, ధ్యానం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని,మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, ప్రభావాలను యోగతో అరికట్టవచ్చన్నారు.
యోగ శిక్షణ శిబిరంలో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ జగదీష్, పెద్దపెల్లి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ, సుల్తానాబాద్ ఎస్సై విజేందర్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై శ్రీనివాస్, పోత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, జూలపల్లి ఎస్ఐ వెంకటకృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణ, యోగ గురువులు సంపత్ ,ప్రభాకర్ శర్మ, యోగా శిక్షకురాలు ఆమని, పెద్దపల్లి డివిజన్ పోలీస్ సిబ్బంది సుల్తానాబాద్ వాకర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ భైరగోని రవి, మెంబర్స్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవి, 2500 మంది విద్యార్థులు యువత మహిళలు వృద్ధులు పాల్గొన్నారు.