Wednesday, September 18, 2024
Homeతెలంగాణబీజేపీ పార్టీలో చేరిన కాకర్ల పల్లి గ్రామస్తులు.

బీజేపీ పార్టీలో చేరిన కాకర్ల పల్లి గ్రామస్తులు.

బీజేపీ పార్టీలో చేరిన కాకర్ల పల్లి గ్రామస్తులు.

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని ఆగస్టు 31(కలం శ్రీ న్యూస్): మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో పలువురు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన, అభివృద్ధికి ఆకర్షితులై సునీల్ రెడ్డి తో పనిచేయాలని బీజేపీ పార్టీ లో చేరుతున్నట్టు వారు వెల్లడించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో మొత్తం 60 సంవత్సరాలు పాలించిన మంథని నియోజకవర్గం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. నరేంద్ర మోడీ సుపరిపాలనతో మన దేశం ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది,రాష్ట్రాల భివృద్ధికి బిజెపి పార్టీ బాటలు వేస్తుంది,కానీ తెలంగాణలో అవినీతి,కుటుంబ పాలన రాజ్యమేలుతుంది,అమెరికాలో లక్షల్లో జీతం మంచి ఉన్నత ఉద్యోగం కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మంథని ప్రాంతానికి వచ్చి ఉద్యమం చేసిన నాకు తీవ్ర అన్యాయం కెసిఆర్ , డబ్బుల కోసం టికెట్ను అమ్ముకొని నన్ను మోసం చేశారు.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యాశాఖ మంత్రిగా,పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఒక్క మెడికల్ కాలేజీ,హాస్పటల్,ఒక పరిశ్రమ కూడా తీసుకురాని అసమర్థపు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,పేద ప్రజలకు చెందాల్సిన ఇందిరమ్మ ఇళ్లలో వందల కోట్ల అవినీతిని కాంగ్రెస్ నాయకులు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుట్ట మధుకర్ వందల కోట్ల అవినీతి సొమ్మును సంపాదించాడు ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి కార్యకర్త ఈ అవినీతి నాయకులను నిలదీయండి ఒక అవకాశం ఇవ్వండి,మంథని ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయండని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్,పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, రామగిరి ఇంచార్జ్ ఎడ్ల సదశివ్, ఉపాధ్యక్షులు రేపాక శంకర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు బోసెల్లి మోనిక,బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు బడుగు శ్రీనివాస్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మాదరబోయిన కుమారస్వామి, బూత్ అధ్యక్షుడు ఎలకుర్తి సురేష్,కురుమ శేఖర్,బోసెల్లి శంకర్,నరమల్ల విజయ్,లంబు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!