హాకీ క్రీడను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్):రామగిరి మండలం సెంటనరీకాలనీలోని రాణిరుద్రమదేవి స్టేడియంలో హాకీ క్రీడను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మంగళవారం ప్రారంభించారు. హాకీ లేజండ్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి హాకీ క్రీడను ఆడి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు క్రీడాదుస్తులను పంపిణీ చేశారు.