Thursday, September 19, 2024
Homeతెలంగాణదళిత గోస బిజెపి పార్టీ భరోసా దీక్ష

దళిత గోస బిజెపి పార్టీ భరోసా దీక్ష

దళిత గోస బిజెపి పార్టీ భరోసా దీక్ష

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్ ):మంథని మండల బిజెపి పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఒక్కరోజు దళిత గోస బీజేపీ పార్టీ భరోసా దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈసారి మంథనిలో సునీల్ రెడ్డి గెలుపు ద్వారానే నిరుపేద దళితుల బతుకుల్లో వెలుగులు కనబడతాయి. మంగళవారం మంథని తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల కమిటీ అధ్యక్షుడు బూడిద రాజు ఆధ్వర్యంలో దళిత గోస బిజెపి పార్టీ భరోసా పేరుతో మంథని మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మాట్లాడుతూ మంథని మండలంలో 147 మంది దళిత బంధు లబ్ధిదారులల్లో కేవలం అధికారం బిఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు, సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపీపీ, జడ్పిటిసి పేర్లు ఉండడం బట్టి చూస్తే ఇది దళిత బంధు కాదని ఇది కేవలం అధికార పార్టీ నాయకుల స్కీం లాగా కనబడుతుందని అదేవిధంగా గ్రామాలలో నివసించని వ్యక్తులకు మరియు వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులకు 10 నుంచి 20 ఎకరాలు కలిగి ఉన్న భూస్వాములను ఈ దళిత బందు స్కీం లబ్ధిదారులుగా ఎంపిక చేశారని గ్రామంలో సెంటు భూములు లేనటువంటి నిరుపేదలు,సరియైనటువంటి ఇల్లు కూడా లేనటువంటి నిరుపేద దళితులు,రేక్కాడితేగాని డొక్కాడని స్థితిలో ఉన్న నిరుపేదలు చాలామంది ఉన్నా కూడా కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు నాయకులకు దళిత బంధు ఇవ్వడం బట్టి చూస్తే ఈ బిఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో ఉన్న నిరుపేద దళితులపై వాళ్లకు ఉన్న చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని బిజెపి నాయకులు అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న నిరుపేద దళిత ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని రానున్న ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ద్వారా తమ ఓటు ద్వారా బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మంథని నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి గెలుపు ద్వారానే నియోజకవర్గంలోని దళితుల బతుకులలో వెలుగులు కనబడతాయని మంథని నియోజకవర్గంలో దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ బిఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతరవేణి క్రాంతి, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్,పట్టణ అధ్యక్షుడు బుడిదా తిరుపతి,మండల ఇన్ఛార్జ్ తోట మదుకర్,మండల ప్రధాన కార్యదర్శి అరే ఓదెలు, బుడిద మల్లేష్,మండల ఉపాధ్యక్షుడు రేపక శంకర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, మైనార్టీ మోర్చా చాంద్ పాషా,శేరిఫ్ ,యువమోర్చా బుర్ర రాజు,కోశాధికారి ఎల్కా సదానందం,కార్యదర్శి గడెపు కృష్ణ,ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి కాసిపేట సంతోష్, కార్యదర్శి జనగామ సంతోష్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి తోటపల్లి లక్ష్మణ్,జిల్లా నాయకులు కొరవేన మల్లికార్జున్,కాసిపేట మల్లేష్ మరియు బూత్ అధ్యక్షులు,కాపురం శేఖర్,బుడిద విష్ణు,పర్తిరెడ్డి శివ సాయి,ఆరే సదానందం,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!