ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా
పదివేల ఆర్థిక సహాయం అందజేసిన చల్లా నారాయణ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్ ):మంథని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ తునిగాని సమ్మయ్య కొడుకు రాకేష్ నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి, తలకు తీవ్రంగా దెబ్బ తగిలి బాధపడుతూ తమని సంప్రదించగా వెంటనే స్పందించి వైద్య ఖర్చులకు 10,000/- రూపాయలు అందించి,హన్మకొండ లోని పినాకిల్ హాస్పిటల్ ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాసరావు తో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి,వారు త్వరగా కోలుకోవాలని వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని దైర్యం చెప్పిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి.