Saturday, July 27, 2024
Homeతెలంగాణక్రాప్ దర్పన్ అప్ పై రైతులకు అవగాహన కార్యక్రమం

క్రాప్ దర్పన్ అప్ పై రైతులకు అవగాహన కార్యక్రమం

క్రాప్ దర్పన్ అప్ పై రైతులకు అవగాహన కార్యక్రమం

వెల్గటూర్,ఆగస్టు 28 ( కలం శ్రీ న్యూస్):విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి దశలోను రైతుకు సహకరించే ఓ యాప్ ను ఐఐఐటీ హెచ్ రూపొందించిందని వ్యవసాయ విస్తరణ అధికారి అయ్యోరి వినోద్ తెలిపారు. ఇందులో భాగంగా వెల్గటూర్ మండలంలోని గొడిశెలపేట క్లస్టర్ గ్రామాలలో ఈ క్రాప్ “దర్పన్”యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో వరి, పత్తి పంటలలో వచ్చే రోగాలను, తెగుళ్లను రైతులకు సులభంగా గుర్తించి, సస్య రక్షణ మార్గాలు తెలపడానికి ఈ యాప్ ఉపయోగ పడుతుందన్నారు. అలాగే గొడిశెలపేట క్లస్టర్ పరిధిలోని అభ్యదయ రైతులకు ఈ యాప్ గురించి వివరించి రైతుల స్మార్ట్ ఫోన్ లో యాప్ ను డౌన్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!