బీజేపీ పార్టీ రామగిరి మండల ఇంచార్జీగా ఎడ్ల సదాశివ్ నియామకం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 28 (కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గం రామగిరి మండలం భారతీయ జనతా పార్టీ ఇంచార్జీగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ ఎడ్ల సదాశివ ని నియమించారు.ఈ నియామకానికి సహకరించిన సునీల్ రెడ్డి కి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ కి పెద్దపల్లి జిల్లా బిజెపి ఇంచార్జి రావుల రామనాధ్ కి, కన్వీనర్, కో కన్వీనర్, అధికార ప్రతినిధి లకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.తన పై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు తగువిధంగా పనిచేసే సునీల్ రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు.