Saturday, July 27, 2024
Homeతెలంగాణకాంగ్రెస్,బిఆర్ఎస్ తో మంథని ప్రాంత అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్,బిఆర్ఎస్ తో మంథని ప్రాంత అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్,బిఆర్ఎస్ తో మంథని ప్రాంత అభివృద్ధి శూన్యం

అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్  

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని ఆగస్టు 27 (కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలో ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మంథని అసెంబ్లీ స్థాయి సమావేశం కన్వినర్ మల్కామోహన్ రావ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య అతిధులుగా అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్, జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాథ్, పార్లమెంట్ కన్వినర్ మల్లికార్జున్,మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి,గొట్టిముకుల సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.నాగేపల్లి గ్రామం నుండి పలువురు మహిళలు బీజేపీ పార్టీ లో చేరారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నాయకులు మాట్లాడుతూ మంథనిలో బీజేపీ గెలుపే మన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి,మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల కాలంలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మొదలైనప్పటి నుండి 1952లో ఒక్కసారి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గులుకోట శ్రీరాములు గెలిచిన తర్వాత మంథని నియోజకవర్గంలో సింహ భాగం కాంగ్రెస్ నాయకులు పరిపాలించారు. నాలుగు సార్లు పీవీ నరసింహారావు మూడు సార్లు శ్రీ పాద రావు ఒకసారి సీఎన్ రెడ్డి నాలుగు సార్లు శ్రీధర్ బాబు నియోజకవర్గంలో మొత్తం కలిపి 60 సంవత్సరాలు పాలించారని 1971 నుంచి 73 వరకు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పీవీ నరసింహారావు ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారని ఒక్కసారి దేశ ప్రధానిగా కూడా సేవలు అందించారని మంథని నియోజకవర్గం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది.

నరేంద్ర మోడీ సుపరిపాలనతో మన దేశం ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది,రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి పార్టీ బాటలు వేస్తుంది,కానీ తెలంగాణలో అవినీతి,కుటుంబ పాలన చేస్తుంది,స్వయాన కెసిఆర్ కూతురు దేశవ్యాప్త సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉంది,అమెరికాలో లక్షల్లో జీతం ఉన్న మంచి ఉన్నత పదవిని కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మంథని ప్రాంతానికి వచ్చి ఉద్యమం చేసిన సునీల్ రెడ్డి కి,తెలంగాణ జెండాను మంథని ప్రాంతంలో నలుదిశల వ్యాప్తిచేసిన రామ్ రెడ్డి కి తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారు.డబ్బుల కోసం టికెట్ను అమ్ముకొని ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యాశాఖ మంత్రిగా,పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఒక్క హాస్పటల్, ఒక పరిశ్రమ కూడా తీసుకురాని అసమర్థపు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పేద ప్రజలకు చెందాల్సిన ఇందిరమ్మ ఇళ్లలో వందల కోట్ల అవినీతిని కాంగ్రెస్ నాయకులు చేశారు.ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుట్ట మధుకర్ వందల కోట్ల అవినీతి సొమ్మును సంపాదించాడు ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి కార్యకర్త ఈ అవినీతి నాయకులను నిలదీయండి విద్యావంతుడు,మంచి వ్యక్తిత్వం ఉన్న సునీల్ రెడ్డి కి ఒక అవకాశం ఇవ్వండి,మంథని ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయండని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేని క్రాంతికుమార్,కొ కన్వీనర్ నాంపల్లి రమేష్,పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,బిఎస్ ఏ ఇంచార్జ్ చిలువేరి సతీష్,పోగ్రామ్ కన్వినర్ ఎడ్ల సదశివ్,మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్,బొమ్మన భాస్కర్,సిరిపురం శ్రీమన్నారాయణ,కోయాల్కర్ నిరంజన్,పిలుమారి సంపత్, మండలాల ఇంచార్జ్ లు తోట మధుకర్ మచ్చగిరి రాము, ఉడుముల విజయరెడ్డి,మల్లారెడ్డి,సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,రాపర్తి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!