Saturday, July 27, 2024
Homeతెలంగాణఇది దళిత బంధా...దగా బంధా

ఇది దళిత బంధా…దగా బంధా

ఇది దళిత బంధా…దగా బంధా 

దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలను దగ్ధం చేసిన దళిత, ప్రజాసంఘాల నాయకులు

 మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 27( కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని దళిత బంధు ఎంపిక పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకి వచ్చిందని ఇది దళితుల బందు కాదని దగా బందు అని దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మంథని ప్రధాన చౌరస్తాలో దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దళిత ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ మంథని మండలంలో దళిత బందును పారదర్శకంగా ఎంపిక చేయలేదని గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్, ఉపసర్పంచ్,సర్పంచ్,ఎంపీటీసీ, లను మరియు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకుల మరియు ఎంపీపీ మరియు జెడ్పిటిసి పేర్లు ఆ దళిత బంధు లిస్టులో ఉండడం దానికి నిదర్శనమని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దళిత బంధు కింద మంజూరైన లిస్టును పున పరిశీలించి గ్రామాల్లో సెంటు భూమి లేకుండా ఉన్న నిజమైన నిరుపేదలను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకులు దళిత బంధు పేరుతో లబ్ధి పొందిన వారితో మాత్రమే ఓట్లు వేయించుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు సమాధానం చెప్పాలని రాజకీయంగా మా దళితులను వాడుకోవాలని చూసిన బిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి మాకు దళిత బంధు ఇస్తేనే మేము ఓట్లు వేస్తామని కరాకండిగా బిఆర్ఎస్ నాయకులకు సమాధానం ఇవ్వాలని వెంటనే ఈ దళిత బంధు లబ్ధిదారుల లిస్టు రద్దు చేయాలని,లబ్ధిదారుల ఎంపికను పునః పరిశీలించి నిజమైనటువంటి నిరుపేద దళితులను ఎంపిక చేయాలని లేదు లేకపోతే మంథని మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దళిత బంధు అందని దళితులందరినీ ఏకం చేసి క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బూడిద తిరుపతి, బూడిద గణేష్, ఆర్ల సందీప్,బోసిల్లి శంకర్, మంథని కిష్ట స్వామి, విరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!