ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానమైనది
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని,ఆగస్టు 26( కలం శ్రీ న్యూస్) : ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు ప్రధానమైనదని ఆర్డిఓ హనుమా నాయక్ అన్నారు. శనివారం మంథని పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల (బాలురు) యందు ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వారు ఓటర్ అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అతి ప్రధానమైనదని, ఓటు హక్కు ద్వారానే అత్యంత విలువైన ప్రజాస్వామ్యం నిర్మాణం జరుగుతుందని ఆయన విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. నూతన ఓటర్ నమోదు,సవరణ కోసం పాఠశాలలో బిఎల్ఓ ను సంప్రదించవలసిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మహేష్,పాఠశాల/కళాశాల సిబ్బంది, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా మధు తదితరులు పాల్గొన్నారు