Wednesday, September 18, 2024
Homeతెలంగాణముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌

బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకుంటామని ముందుకు వస్తున్న ముస్లిం మైనార్టీలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని, ఆగస్టు 26 (కలం శ్రీ న్యూస్) :ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా ప్రభుత్వం లేదనెటోళ్లకు మళ్లా ఎందుకు ఓట్లు వేయడమనే ఆలోచనకు ప్రజలు వచ్చారని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.మంథని పట్టణానికి చెందిన మెకానిక్‌ పాషా,షేక్‌ జావేద్‌ల ఆధ్వర్యంలో 50మంది ముస్లిం మైనార్టీలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.శనివారం మంథనిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏండ్లు కాంగ్రెస్‌ జెండా మోస్తూ ఎమ్మెల్యేను భూజాలపై ఎత్తుకు తిరిగిన వాళ్లకు కనీసం సాయం చేసిన దాఖలాలు మంథని ఎమ్మెల్యే కు లేదన్నారు. మంథనికి చెందిన జావేద్‌ సమాజం కోసం ఉపయోగపడాలని కాంగ్రెస్‌జెండా మోస్తూ ఎమ్మెల్యేను భుజాలపై ఎత్తుకుని తిరిగితే ఆపద సమయంలో ఆదుకోలేదని, ఆస్పత్రిలోపడేసి ఫోటోలు దిగిపోయారే తప్ప ఆదుకునే ఆలోచన చేయలేదన్నారు.ఆ యువకుడిని కాపాడుకోవాలని కుటుంబసభ్యులంతా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ వద్దకు వస్తే ఆమె దగ్గరుండి పర్యవేక్షించి ఆదుకున్నారని,ఆదుకున్న విశ్వాసాన్ని ఈనాడు ముస్లిం మైనార్టీలు చాటుకున్నారని ఆయన అన్నారు.ఏదో చేస్తాడనే నమ్మకంతో ఎమ్మెల్యేకు ఓట్లు వేసి గెలిపిస్తే ఐదేండ్లు అభివృద్దిలో వెనుకబడిపోయామని ప్రజలు గ్రహించి బాధపడుతున్నారని ఆయన అన్నారు.ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, ఈనాడు బీఆర్‌ఎస్‌,ఎంఐఎం పార్టీలను కలిపి అబద్దాలతో ముస్లిం మైనార్టీలను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నంచేస్తోందన్నారు.కాంగ్రెస్‌ కపట నాటకాలను గమనించిన ముస్లింమైనార్టీలు చైతన్యవంతులై బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకుంటామని ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీకి చెందిన పెద్దమనిషి మజార్‌ ఓటు విలువ తెలుసుకోవాలని గొప్ప సందేశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలకు సీఎం కేసీఆర్‌ సర్కార్‌ ఏ విధంగా అండగా ఉంటుందో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తుందో తొమ్మిదేండ్లుగా చూస్తున్నామని ఆయన వివరించారు.ఓటు విలువ తెలుసుకోకపోతే మళ్లీ అనార్థాలు తప్పవని మంథని, మహదేవ్‌పూర్‌కు చెందిన ముస్లిం మైనార్టీలు గ్రహించారని, వాస్తవాలు సమాజానికి తెలియకపోతే మళ్లా మోసం చేస్తారని ఆయన అన్నారు. చేతకాని తనం కప్పిపుచ్చుకోవడానికి మంథని ఎమ్మెల్యే ఏం అడిగినా మా ప్రభుత్వం లేదని చెప్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. చెంచడు నీళ్లు పోయని ఒక్క కుటుంబానికి 40ఏండ్లుగా ఓట్లు వేసి గెలిపిస్తే నీతిగా నిజాయితీగా ఉండే ఓటర్లు, ప్రజల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు.ఈనాడు మంథనికి చెందిన ముస్లింమైనార్టీలంతా ఏకమై మంథనిలో బీఆర్‌ఎస్‌పార్టీని కాపాడుకుంటామని,తన వెంటే ఉంటామని ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడే అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేసిన బీఆర్‌ అంబేద్కర్‌ ఓటు హక్కు కల్పించారని, ఓటు ఒక్కటే మన తలరాతను మార్చుతుందని,ఆ ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకుని మన కోసం ఆలోచన చేసే వాళ్లను నాయకులుగా ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!