బీజేపీ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మహిళ నాయకులు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 26 (కలం శ్రీ న్యూస్): మంథని పట్టణంలో బిఆర్ ఎస్ పార్టీ కి చెందిన పలువురు మహిళల నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరికి అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన మహిళలకు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సునీల్ రెడ్డి తో కలసి పనిచేయాలనే ఉదేశ్యం తో పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, సీనియర్ నాయకులు వేల్పుల సత్యం,కోరబోయిన మల్లిక్,ఎడ్ల సదశివ్,బోసెల్లి శంకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు బుర్ర రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.