Saturday, July 27, 2024
Homeతెలంగాణసమాజం బాగుండాలనే ఆలోచన చాలా గొప్పది

సమాజం బాగుండాలనే ఆలోచన చాలా గొప్పది

సమాజం బాగుండాలనే ఆలోచన చాలా గొప్పది

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 26 (కలం శ్రీ న్యూస్ ): సమాజం బాగుండాలనే ఆలోచన చాలా గొప్పదని,అలా ఆలోచించే వాళ్లు అరుదుగా ఉంటారని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

శనివారం మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కపిల గోశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనాటి సమాజాన్ని మంచి కంటే చెడు ఎక్కువగా ప్రబావితం చేస్తుందని, మంచిని గుర్తించడం కంటే చెడునే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలను గుర్తించి ప్రజాప్రతినిధిగా అధికారులతో మాట్లాడుతున్న క్రమంలో తాము కొంచెం ఆగ్రహానికి గురైతే ఆ విషయాన్ని మాత్రమే ప్రచారం చేసి తమను దోషిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారే కానీ అక్కడ జరిగిన విషయంపై ఆలోచనచేయడం లేదని ఆయన వాపోయారు. మనం చేసే ప్రతిపని పది మందికిమేలు చేసేలా ఉండాలనేది తన ఆలోచన అని ఆయన వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో తన నిధులను అనేక అభివృధ్ది పనులకు వెచ్చించామని, కాళేశ్వరం మంచి పర్యాటక కేంద్రంగా కావాలని,సందర్శకుల దృష్టి మళ్లాలని ఒక చెట్టుపై ఇల్లు కట్టించానని అన్నారు. అలాంటి ప్రాంతాలను చూసేందుకు వచ్చే సందర్శకులతో అక్కడి కొంత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందన్నారు.కానీ గత పాలకులు మాత్రం తమ నిదులను తమ కార్యకర్తల జేబులు నింపేందుకు మాత్రమే ఉపయోగించారే కానీ ఏనాడు ఇలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు నలుగురికి ఉపాది కల్పించాలనే ఆలోచనలే చేస్తున్నామని ఆయన తెలిపారు. సమాజం బాగుపడాలి,ప్రతి ఒక్కరు బాగుండాలనే తపన, ఆకాంక్షతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.కపిల గోషాల ద్వారా అనేక ప్రయోజనాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిస్తూ మనం ఆరాధించే గోమాతల సంరక్షణ ఉంటుందని, ఈ క్రమంలోనే తాను కపిల గోషాలకు తనవంతు సహకారం అందించానన్నారు.తాను పెద్దగా చదువుకోకపోయినా గొప్పగా ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు.కొంత మంది నాయకుల నిర్లక్ష్య పాలనతో మంథని ప్రాముఖ్యత,గొప్పతనం ద్వంసమైందని,ఆ రోజుల్లోనే పర్యావరణ పరిరక్షణకు మంథనికి చెందిన గీట్ల జనార్థన్‌రెడ్డి నడుం బిగించారని ఆయన గుర్తు చేశారు. సమాజ హితం కోసం ఆనాడు ఎంపీపీ గా ఉన్ననాటి నుంచే ముందుకు అడుగు వేశానని, అనేక కార్యక్రమాల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టామని,సమాజం బాగుకోసం అనుక్షణం ఆలోచన చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!