Saturday, July 27, 2024
Homeతెలంగాణకష్టాల్లో ఉన్నోళ్లకు ముందుగా కనబడేది కామ్రేడ్

కష్టాల్లో ఉన్నోళ్లకు ముందుగా కనబడేది కామ్రేడ్

కష్టాల్లో ఉన్నోళ్లకు ముందుగా కనబడేది కామ్రేడ్

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్  

మంథని ఆగస్టు 26 (కలం శ్రీ న్యూస్ ):ప్రజల కోసం పోరాటం చేసేటోళ్లే చిరకాలం నిలిచిపోతారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. శనివారం గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఏఐటీయూసీ 16వ కేంద్ర మహసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజల ఆకలి,కష్టాలు తీర్చాలనే ఆలోచనలో పోరాటం చేసేది కామ్రేడ్స్‌ అని,ఈ ప్రాంతంలో ఎక్కువగా కామ్రేడ్స్‌ ఉన్నారని ఆయన అన్నారు.కష్టాల్లో ఉన్నోళ్లకు ముందుగా కనబడేది కామ్రేడ్స్‌ అని,కార్మికులకు కామ్రేడ్స్‌ మీద ఎంతో నమ్మకం ఉంటుందని, తమ కష్టాలు,ఆకలి తీర్చుతారనే నమ్మకం వారిలో ఉంటుందన్నారు. అయితే ఈనాటి సమాజంలో అవసరాలకు అనుగుణంగానే మనల్ని వాడుకోవడం సహజంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అవసరం ఉన్నంత వరకే ప్రజాప్రతినిధులను కావచ్చు లేక కార్మిక యూనియన్‌ నాయకులను వాడుకుని వదిలేస్తున్నారని ఆయన అన్నారు.ఇలాంటి క్రమంలో మనం చేసే పోరాటం,ఉద్యమాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 20ఏండ్ల క్రితం సింగరేణి సంస్థ, అందులో వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు,యూనియన్‌ల గురించి తనకు ఏమీ తెలియదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. తొమ్మిదేండ్ల కాలంలో మంథని ప్రాంతంలోని సింగరేణి సంస్థకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మంథని ప్రాంతంలో పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తూ వారి కోసం తపిస్తుంటే ఈ సమాజానికి గుండాగా రాక్షసుడిలా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మామూలు కుటుంబంలో జన్మించిన తాను అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఈనాడు ఈస్థాయికి చేరుకున్నానని ఆయన తెలిపారు. సమాజం బాగుండాలనే ఆలోచన చేసే తాను ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలని ఆనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని ఆయన గుర్తుచేశారు.ప్రజల అవసరాల కోసం ఏ పని చేసినా దానిని భూతద్దంలో పెట్టి రాద్దాంతం చేస్తున్నారే కానీ ఏనాడు ప్రజలకు చేసిన మంచిని గ్రహించడం లేదన్నారు.ఒకప్పుడు ఎర్ర అంగి వేసుకుంటే భయంభయంగా ఉండేదని,కానీ ఈనాడు అదే ఎర్ర అంగి వేసుకుంటే ఒక ధైర్యం,ఒక స్పూర్తి కన్పిస్తుందని ఆయన తెలిపారు. అయితే విచిత్ర పరిస్థితులు ఉన్న మంథనిపై దృష్టిసారించాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎందుకు వేస్తున్నామో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆనాడు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచన చేసిన బీఆర్‌ అంబేద్కర్‌ మనకు ఓటు హక్కు అందించారని అలాంటి ఓటును సక్రమం వినియోగించుకోక పోవడం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఓటు విలువ తెలిసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో తమవంతు కృషి చేయాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!