పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా విజయ్
పెద్దపల్లి,ఆగస్టు26(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా పోగుల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ క్లబ్ బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని, క్లబ్ సభ్యులందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి ,ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్, కోశాధికారి బెజ్జంకి నరేష్ , తోటి జర్నలిస్టులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ ఎన్నిక పట్ల టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్,నాయకులు బిక్షపతి, సుదర్శన్,వినోద్,తిరుపతి రెడ్డి,పల్ల మహేష్, సుంక శ్రీధర్,జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్,వనపర్తి శ్రీనివాస్,సతీష్,శ్రీనివాస్, ఉదయ్ లతో పాటు పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.