Tuesday, December 3, 2024
Homeతెలంగాణదాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,ఆగస్టు 25( కలం శ్రీ న్యూస్ ): దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు జంగపెల్లి రాజమల్లు అనే రైతు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమల్లు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు.ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 30 అ/1 లోని 1-20, సర్వేనెంబర్ 29 ఊ / 3లోని 0.36 గుంటల విస్తీర్ణం గల భూమిలో వరి నాటు పనులు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పల్లె రాము లక్ష్మణ్ జంగాపల్లి రాజేశ్వరి అనే ముగ్గురు వ్యక్తులు తమపై కారపూడి చల్లుతూ కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేశారన్నారు. మమ్మల్ని దాడి చేస్తుండగా మా పొలానికి వరి నాటు పనుల కోసం వచ్చిన కూలీలంతా ప్రత్యక్షంగా చూశారన్నారు. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న తమపై అకారణంగా దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!