Thursday, April 18, 2024
Homeతెలంగాణఎమ్మెల్యే శ్రీధర్ బాబును దూషించడం సరైన పద్ధతి కాదు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబును దూషించడం సరైన పద్ధతి కాదు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబును దూషించడం సరైన పద్ధతి కాదు

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 25( కలం శ్రీ న్యూస్ ) : గొల్లపల్లి నుండి మంథని వరకు మొన్న జరిగిన బిఆర్ఎస్ ర్యాలీలో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబును బిఆర్ఎస్ పార్టీ మంథని అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు దూషించడం సరైన పద్ధతి కాదని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు అన్నారు.శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పుల రాజు మాట్లాడుతూ మొన్న బీఆర్ఎస్ ర్యాలీలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాటలను తీవ్రంగా ఖండించారు. పుట్ట మధు నువ్వు గత తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి మంథని ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశావో చెప్పుకో అంతేగాని నువ్వు నీ చెంచా గాళ్ళతో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు.మంథనిలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇప్పించావో,ఎంతమందికి బీసీలకు బీసీ బందు ఇప్పించావో చెప్పాలి అని అన్నారు. మంథని ప్రాంత ప్రజలు నాలుగుసార్లు దుద్దిల్ల శ్రీధర్ బాబుని ఎమ్మెల్యేగా గెలిపించారని,మళ్లీ కూడా మంథని ప్రాంతానికి శ్రీధర్ బాబు భారీ మెజార్టీతోని గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు .పుట్ట మధు నువ్వు టికెట్ తెచ్చుకొని నీ అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించి ఓట్లు వేపిచ్చుకో అంతేగాని మా నాయకులు శ్రీధర్ బాబు గురించి మాట్లాడితే ఇంకొకసారి ఊకునే సవాలే లేదు అని అన్నారు. మంథనిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించారో చెప్పాలని కోరారు.

ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై గాని,మా ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పైన పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునే సవాలే లేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు లైసెట్టి రాజు,పార్వతి కిరణ్ పటేల్, ఖానాపూర్ మాజీ సర్పంచ్ దోరగొల్ల శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!