Thursday, April 18, 2024
Homeతెలంగాణమంథని నియోజకవర్గ ప్రజలు ఈసారి ఆలోచించి ఓటెయ్యాలి

మంథని నియోజకవర్గ ప్రజలు ఈసారి ఆలోచించి ఓటెయ్యాలి

మంథని నియోజకవర్గ ప్రజలు ఈసారి ఆలోచించి ఓటెయ్యాలి

అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్ 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 25 (కలం శ్రీ న్యూస్) :ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి ఆధ్వర్యంలో మంథని పట్టణలో అస్సాం ఎమ్మెల్యే, సుశాంత్,మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంథని పట్టణ,మండలల కు సంబందించిన మండల కమిటీ,పట్టణ కమిటీ శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులతో పాటు బూత్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సుశాంత్ మాట్లాడుతూ మన దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.పసల్ భీమా, ఆయుష్ మాన్ భరత్, అవాస్ యోజన వంటి పథకాలు తెలంగాణ లో వస్తే ప్రజలు అందరూ మోదీకి ఓటు వేస్తారని దుర్బుద్ధితో కెసిఆర్ ఆడ్డుకుంటున్నారు, మంథని నియోజకవర్గం లోని ప్రజలను పట్టించుకోని 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసి వందల వేల కోట్ల పడగలెత్తి 9 సంవత్సరాలు పరిపాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పుట్ట మధు ఏనాడు తపన పడలేదు సరి కదా,నియోజకవర్గం లో దళితుల పైన దాడులు పెరిగాయని మంథని నియోజకవర్గంలో రాయలసీమను తలదన్నే విధంగా ఫ్యాక్షన్ రాజకీయాల తో గ్రామాలలోని ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా రాజకీయం నడుపుతున్నారు.అదేవిధంగా కెసిఆర్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళిత ముఖ్య మంత్రి అని చేపి మోసం చేశారు,తెలంగాణ రాష్ట్రo కొరకు జీవితాలు త్యాగం చేసి కొట్లాడిన సునీల్ రెడ్డి కి 2014 లో టికెట్ ఇవ్వకుండా డబ్బులకు టికెట్ అమ్ముకున్నారు.కెసిఆర్ నిజమైన ఉద్యమ కారుడు సునీల్ రెడ్డి ని గెలిపించండి,తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం చేయని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పదవులు అనుభవిస్తున్నారు, వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న పుట్ట మధును మళ్ళీ గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తాడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన శ్రీధర్ బాబు మంత్రి గా పని చేసి కూడా ఈ ప్రాంతంలో ఒక్క హాస్పిటల్, మెడికల్ కాలేజీ. నిరుద్యోగుల కోసం ఈ ప్రాంత రైతుల కోసం పరిశ్రమలు తీసుకురాలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుట గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు నిరుపేదల పేరిట ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఎత్తుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ఈ అవినీతి సి బి సి ఐ డి విచారణలో కూడా తేలిందని ఇలాంటి అవినీతి అసమర్ధ కాంగ్రెస్ నాయకులను నమ్మి ఓటేస్తే గ్రామాలలో ఉన్న నిరుపేదల పేరిట మరిన్ని భారీ స్కామ్ లు చేసే అవకాశం ఉంటుందని అదేవిధంగా కాలేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన రైతాంగానికి శాశ్వత పరిష్కారం చూపించక కనీసం ప్రభుత్వం ద్వారా ఒక రూపాయి నష్టపరిహారం ఇప్పించక రైతులను అరిగోసపుచ్చుకుంటున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఈ మంథని నియోజకవర్గం రైతాంగం తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి లక్షలాది రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజాసేవయే లక్ష్యంగా పనిచేస్తున్న వివాద రహితుడు బిజెపి రాష్ట్ర నాయకులుచందుపట్ల సునీల్ రెడ్డి ని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఈసారి తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని బిజెపి ప్రభుత్వంలో ఇప్పటికే రైతులకు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు కేంద్రం ద్వారా అనేక ప్రయోజనాలు చేయకుతున్నాయని మంథనిలో బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి గెలవడం ద్వారా ఈ నియోజకవర్గ రైతాంగానికి మరిన్ని ప్రభుత్వం ద్వారా మరిన్నిసేవలు చేసి చేయించే విధంగా అవకాశం ఉంటుందని తెలిపారు కార్యక్రమం అనంతరం మంథని పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీ పాత పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌరస్తా గుండా మంథని పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, కో కన్వీనర్ నాంపల్లి రమేష్, అధికార ప్రతినిధి పోతారవేని క్రాంతికుమార్, పోగ్రామ్ కన్వినర్ ఎడ్ల సదశివ్, బి ఎస్ ఏ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ఇంచార్జ్ తోట మధుకర్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!