వైభవంగా శ్రీ మహాలక్ష్మికి పూజలు
మంథని రిపోర్టర్ / నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 25 (కలం శ్రీ న్యూస్): పవిత్ర శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మంత్రపురి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో భక్తులు అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని నాయననందకరంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి వేదోక్తంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలను ఆలయ ప్రధాన అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పసుపు, కుంకుమలు,సారే,గాజులు పువ్వులు,సుగంధ ద్రవ్యాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.మండపంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ, ప్రత్యేక భజనలు నిర్వహించారు.అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది.ఇండ్లలో మహిళా భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని అచరించి వాయినాలు ఇచ్చున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారుపాక చంద్రకళ-రమేష్, డైరెక్టర్లు కాయితోజు సమ్మయ్య,నీలం రమేష్, పోతరాజు వెంకటలక్ష్మి, బత్తుల విజయలక్ష్మి-సత్యనారాయణ, బడికల శ్రీనివాస్, కొత్త బాలయ్య, భక్తులు పాల్గొన్నారు.