Wednesday, December 4, 2024
Homeతెలంగాణపెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ బొద్దుల లక్ష్మణ్ కు కేటాయించాలి 

పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ బొద్దుల లక్ష్మణ్ కు కేటాయించాలి 

పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ బొద్దుల లక్ష్మణ్ కు కేటాయించాలి 

యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి

జూలపల్లి,ఆగస్టు25(కలం శ్రీ న్యూస్):పద్మశాలిలకు రాజకీయ అవకాశం కల్పించి పెద్దపెల్లి బిఆర్ఎస్ పార్టీ టికెట్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ,వ్యాపారవేత్త, యువకుడు ,విద్యావేత్త, జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కు కేటాయించాలని జూలపల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ దేవాలయంలో సంఘ సమావేశం ఏర్పాటు చేయగా,ఈ కార్యక్రమానికి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీలు 40 లక్షలకు పైగా ఉన్నప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీలను గుర్తించకపోవడం మంచిది కాదన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పద్మశాలి ఓట్లతోనే గెలిచాడని మర్చిపోవద్దని అన్నారు. కోరుట్ల ,జగిత్యాల తదితర ప్రాంతాలలో పద్మశాలీలు ఓటర్ల శాతం అత్యధికంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా పద్మశాలీలకు టికెట్ కేటాయించకుండా అగ్రవర్ణాలకే కేటాయించి పద్మశాలిల ఓట్లతో గెలిచి మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కుతున్నారని పేర్కొన్నారు. చలో కోరుట్ల రాజకీయ యుద్ధభేరి ద్వారా తమ సత్తా చాటినప్పటికీ పద్మశాలీలను విస్మరించడం రానున్న ఎన్నికలలో పద్మశాలిలు అందరం ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగుతామన్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పద్మశాలిలకు ఒక కమ్యూనిటీ హాలు, స్థలం కానీ ఇంతవరకు కేటాయించకపోవడం చూస్తే దాసరికి పద్మశాలిలపై ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. రానున్న ఎన్నికలలో పెద్దపెల్లిలో పద్మశాలి జిల్లా సమావేశం ఏర్పాటు చేసి తమ కార్యాచరణను వివరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాలింగల హనుమయ్య, యువజన సంఘము మండల అధ్యక్షుడు మేర్గు రమేష్, అందే తిరుపతి, చిప్ప శంకరయ్య, సుంకనపల్లి భూమయ్యా, చిప్ప శ్రీకాంత్, అందే రాజయ్య, దొంతుల రాజమల్లయ్య, సిరిపురం కనకయ్య, బొద్దుల నారాయణ, వెంకటేశం, సాయినాథ్, బండి రాంనారాయణ, బూర్ల లక్ష్మీనారాయణ, వెంగల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!