ఓటరు అవగాహన కార్యక్రమం
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్ ):ప్రభుత్వ డిగ్రీ కళాశాల,మంథనిలో రాజనీతి శాస్త్ర విభాగం,ఎలక్టోరల్ లిటరసి క్లబ్(ఇఎల్ సి ) ,ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గురువారం కళాశాల ప్రిన్సిపల్ ఏండి తాహెర్ హుస్సేన్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకొని ఉత్తమ పాలకులను ఎన్నుకొనుట తమ భాద్యతగా భావించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగిరి తాహశీల్దార్ రామచంద్ర రావు మాట్లాడుతూ అక్టోబర్ 1,2023 వరకు 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటరు ఫారం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రయాన్ 3 లాండింగ్ అయినవిధానం గురించి కంప్యూటర్ అధ్యాపకులు ముకుందం డిజిటల్ క్లాసురూంలో వాటి యొక్క విడియోలను చూపించి చంద్రయాన్ 3 పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు డా.భారత్,అకడమిక్ కో ఆర్డినేటర్ పర్శయ్య,ఐక్యూఏసి కో ఆర్డినేటర్ కృష్ణ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు సతీష్,అమర్నాథ్,రజిత,మానస,బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.