ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం అన్యాయం
ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జ్ అట్టెం రమేష్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్):ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయింపుల్లో 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి ఒక్కటి కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి అట్టెం రమేష్ ముదిరాజ్ అన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ జెండాలు మోసిన ముదిరాజ్ కులస్తులకు టికెట్టు కేటాయించకపోవడం శోచనీయమన్నారు.బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిన అట్టి మీటింగ్ ను విజయవంతం చేయడంలో ముదిరాజ్ కులస్తులు గొప్ప పాత్ర పోషించారని అలాంటి కులానికి ఒక్కటికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ముదిరాజ్ కులస్తుల ఓట్లతో రెండు సార్లు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.119 నియోజక వర్గాల్లో 20 నియోజకవర్గాల్లో మా ఓట్లు వేసుకుంటే గెలుస్తామని ఇంకో 40 స్థానాల్లో ఒకటి రెండు బీసీ కులాలను కలుపుకుంటే 30 నియోజకవర్గాల్లో6 గెలుపు ఓటములు డిసైడ్ చేస్తామని తెలిపారు.మా కులానికి చేసిన అన్యాన్ని తట్టుకోలేక పోతున్నామని బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో మంత్రి మండల కన్వీనర్ ఊదరి మల్లేష్,రామగిరి మండల బాధ్యులు ఓదెలు,సాగర్ల తిరుపతి ,మల్లయ్య,సాధువుల తిరుపతి,ఉదరి నాగరాజు, గంగుల శంకర్,రాచకొండ శంకర్, ఆదర్శ,తదితరులు ఉన్నారు