Tuesday, December 3, 2024
Homeతెలంగాణవరద బాధితులకు లయన్స్‌ ఇంటర్ల్ నేషనల్ చేయూత

వరద బాధితులకు లయన్స్‌ ఇంటర్ల్ నేషనల్ చేయూత

వరద బాధితులకు లయన్స్‌ ఇంటర్ నేషనల్ చేయూత

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్):ఇటీవల మన ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు,ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల బడుగులు తమ సర్వస్వాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని,దీనికి సత్వరమే స్పందించిన లయన్స్‌ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద‌ సంస్థ వరద బాధితుల పక్షాన నిలిచి దాదాపు లయన్స్ 320జీ డిస్ట్రిక్ట్ జిల్లా పరిధి లో రూ: 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులను బాధిత కుణటుంబాలకు ఏర్పాటు చేశారని లయన్‌ జిల్లా గవర్నర్‌ హనుమాండ్ల రాజిరెడ్డి అన్నారు. విపత్తు నిర్వహణకు అత్యవసర నిధి నుంచి 8 లక్షల రొక్కాన్ని విడుదల చేయడం హర్షదాయకమని తెలిపారు. పూర్వ కరీంనగర్‌,ఆదిలాబాదు జిల్లాల్లో 500 వరద ప్రభావిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ నెలసరి బియ్యం,జత దుప్పట్టు, స్టీల్‌ ప్లేట్‌, గ్లాసు,పప్పులు,వంట నూనెలు,ఇతర నిత్యావసరాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ రోజు స్థానిక ఫంక్షన్‌ హాలులో జరిగిన వితరణ సమావేశంలో ఎంపిక చేసిన నిరు పేదలకు లయన్స్‌ నాయకులు జిల్లా గవర్నర్‌ లయన్‌ హెచ్‌ రాజిరెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్‌ ఆర్‌ నారాయణ రెడ్డి, ఉపజిల్లా గవర్నర్లు ఎన్‌ వి రావు,ఎక్‌ కోదండరామ్‌, జిల్లా కెబినెట్‌ కార్యదర్శి రమణారెడ్డి, అదనపు కార్యదర్శులు లయన్‌ కెప్టెన్‌ డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, ఎం భద్రేశం,జయపాల్‌ రెడ్డి,మంథని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు లయన్‌ వెంకటేశ్, కోశాధికారి మండల మల్ల రెడ్డి, డైరెక్టర్స్ చిదురాల మల్లికార్జున్ రెడ్డి, జీ ఎస్ రెడ్డి, సభ్యులు పుదరి దత్త గౌడ్,బుద్ధర్తి సతీష్ కుమార్ ఇతర క్లబ్‌ సభ్యులు పాల్గొనగా,లబ్దిదారులు, పట్టణ పౌరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!