Sunday, May 26, 2024
Homeతెలంగాణగెలుస్తాననే నమ్మకంతోనే టికెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

గెలుస్తాననే నమ్మకంతోనే టికెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

గెలుస్తాననే నమ్మకంతోనే టికెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని, ఆగస్టు 23(కలం శ్రీ న్యూస్ ):ప్రపంచంలో ఎక్కడా జరుగని విధంగా మూడు పార్టీలు ఒకే వేదికపై ఏకమై కుట్రలు చేయడం మంథనిలో జరిగిందని, కాంగ్రెస్‌, బీజేపీ,బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు ఒకే వేదికపైకి చేరి తనపై కుట్రలు చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపధ్యంలో బుధవారం హైదరాబాద్‌ నుంచి మంథనికి వచ్చిన పుట్ట మధూకర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు,గొల్లపల్లి నుంచి మంథని వరకు బారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా మంథని అంబేద్కర్‌ చౌక్‌లో భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే ఆ పార్టీ వాళ్లు ఆ నాయకుడు మాకు వద్దనే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా మూడు పార్టీల నాయకులు ఒకే వేదిక మీద ఏకమై పుట్ట మధూకర్‌కు టికెట్‌ ఇవ్వవద్దని కుట్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై ఇంత పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు జరుగుతున్న క్రమంలోనే తాను పదే పదే చర్చ జరుగాలని చెబుతున్నానని అన్నారు. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు.నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న వాళ్లకు అధికారం రావాలని ఆరాటపడుతున్నానని అన్నారు.ఈ మట్టిలో పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన వాళ్లు నాయకులుగా ఉంటేనే ఆభివృధ్ది సాధ్యమవుతుందని ఆయన అన్నారు.ఆనాడు ఎంతో మంది మహనీయులు మన గురించి మన భవిష్యత్‌ గురించి ఆలోచన చేశారని అన్నారు. ఆకలి తీర్చుకోవడం, ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎంతో మంది తుపాకిలు చేతపట్టి అడవిబాట పట్టారని, ఆనాటి కాంగ్రెస్‌ పాలకుల పుణ్యాన ఎంతో మందిబిడ్డలు నేలకొరిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కానీ ఈనాడు తుపాకి పట్టి అడవికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆనాడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గొప్పగా ఆలోచన చేసిన ఓటు అనే ఆయుధంతో మన తలరాతలు మార్చుకుని బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ గొప్పదని నిరూపించుకోవాలన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతివిషయంపై చర్చించాలని, ఆలా చర్చించకపోతే మోసం చేసేవాడే మల్లీ మోసం చేస్తూనే ఉంటాడని ఆయన అన్నారు. 40ఏండ్లు పాలించిన ఒకే కుటుంబం ఏం చేసిందో, ఎం చేస్తదో చెప్పడం లేదని, ఏమీ చేయనోళ్లకు మళ్లీ ఓట్లు వేయడం ఎందుకో ప్రజలు ఆలోచించాలన్నారు. మమూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఎవరికి దక్కని అవకాశం తనకి దక్కిందని, నాలుగోసారి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై నమ్మకంతో టికెట్‌ ఇచ్చారని అన్నారు.మంథనిలో ఒక రాక్షసుడు ఉన్నాడని, అతడిని ఓడించడం పుట్ట మధూకర్‌తోనే సాధ్యమని సీఎం కేసీఆర్‌ గట్టిగా నమ్మి తనకు అవకాశం కల్పించారన్నారు.అయితే నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఇవ్వరని, లేనిపోనివి చెప్పి సమాజానికి దూరం చేసే కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డిపై కుట్రలు చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆయన గుర్తు చేశారు.

నియోజకవర్గ ప్రజల గురించి నిరంతం పరితపించడం, మీ బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయడం, మీ ఆకలి తీర్చడం, మంచి ఆస్పత్రుల్లో చూపించడమే నేను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. తాను తన సతీమణి ఇప్పటికి తొమ్మది సార్లు పోటీ చేశామని,ఈసారి పదోసారి పోటీలో ఉంటున్నామని,ఇదంతా ఈ ప్రాంత ప్రజల దీవెనలేనని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్నది ఓటు బంధం కాదని రక్తసంబంధమని, ఈ ప్రాంత ప్రజలు అక్కాచెల్లెలు, అన్నా తమ్ముళ్లు తల్లిదండ్రుల్లా ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు.తాను హైదరాబాద్‌ నుంచి వస్తున్నానని పైసలు ఇవ్వకపోయినా పెట్రోల్‌ పోయించకపోయినా స్వచ్చందంగా ఇంత మంది రావడం సంతోషంగా ఉందని, 2014 కన్నా రెట్టింపు ఉత్సాహం కార్యకర్తల్లో కన్పిస్తుందని ఆయన తెలిపారు. తనకు ప్రజలనుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్సోళ్లు బీజేపీ నాయకులను వాడుకుని కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్సోళ్ల చెంతకు పోతే కసాయోన్ని నమ్మినట్లేనని బీజేపీ నాయకులకు హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక మంచి పనులే చేశానని, నీతినిజాయితీగా ప్రజల కోసమే బతుకుతున్నామని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే కాకముందు ఎక్కడ రాజకీయ మీటింగ్‌ పెట్టినా వ్యాపారస్తుల నుంచి పైసలు వసూలు చేసేవారని, వర్తక సంఘం,ఫర్టిలైజర్స్‌,కిరాణ షాపులు, బ్రాండీషాపుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజకీయ మీటింగ్‌లకు పైసలు వసూలు చేయడానికి చరమగీతం పాడినట్లు ఆయన తెలిపారు. ఈనాడు తనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీలో సామాజిక న్యాయం జరుగలేదంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. 40ఏండ్లుగా పరిపాలన చేస్తున్న ఒకే కుటుంబం ఎక్కడ సామాజిన న్యాయం చేసిందో ఆలోచన చేయాలన్నారు. అనేక ఏండ్లు కాంగ్రెస్‌పార్టీలో పనిచేసిన నాయకులకు కనీసం జిల్లా స్థాయి పదవులు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసే నాయకులకు పైసా ఖర్చు లేకుండా పదవులు ఇచ్చే బాధ్యత తనదేనంటూ భరోసా ఇచ్చారు. గతంలో సమస్య చెప్పుకోవడానికి వేలు ఖర్చు చేసి ఎమ్మెల్యేను కలిసేవారని, కానీ ఈనాడు పైసా ఖర్చు లేకుండా తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు. తాను ఓడిపోతే దుకాణం బంద్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటిది ఏమీ ఉండదని, మంథనిలో రాజగృహ కట్టుకుని ప్రజలకు నమ్మకం కల్పించానని ఆయన అన్నారు. మనం ఐదేండ్లకోసారి ఓటు వేసి గెలిపించే నాయకుడు మన ఆకలి తీర్చేవాడై ఉండాలని, ఆ దిశగా ప్రజలు ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తనపై నమ్మకంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబానికి నియోజకవర్గ ప్రజలు, అభిమానుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!