మంథనిలో బీజేపీ పార్టీ గెలుపు తథ్యం
అస్సాం ఎమ్మెల్యే సుశాంత్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని, ఆగస్టు 20 (కలం శ్రీ న్యూస్ ):ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంథనికి విచ్చేసిన అస్సాం ఎమ్మెల్యే, తాత్కాలిక మంథని ఇంచార్జ్ సుశాంత్ కి స్వాగతం పలికి,శాలువాతో సన్మానించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.అనంతరం పార్టీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమలో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తప్పకుండా తెలంగాణలో అధికారం చేపట్టబోతుంది అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో మంథని నియోజక వర్గానికి సునీల్ రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా తప్పకుండా గెలిపించుకు తీరాలని సంకల్పంతో ఉన్నట్టుగా వారు తెలియపరిచారు.స్థానికంగా ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ అవినీతి చిట్టా మరియు స్థానిక ఎమ్మెల్యే అసమర్ధ పాలనను నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్,కో కన్వీనర్,సీనియర్ నాయకులు, సోషల్ మీడియా,కన్వీనర్లు, మండల ఇన్చార్జులు,బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.