Saturday, July 27, 2024
Homeతెలంగాణఅంతా హడావుడే.. అభివృద్ధి లేదు..

అంతా హడావుడే.. అభివృద్ధి లేదు..

అంతా హడావుడే.. అభివృద్ధి లేదు..

బిఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి దాసరి ఉష

కాల్వ శ్రీరాంపూర్,ఆగస్టు20(కలం శ్రీ న్యూస్):కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం, వెన్నoపల్లి గ్రామాలలో మన ఊరు – మన ఉష 26వ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి దాసరి ఉష హాజరయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 9 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని, వందల కోట్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని హడావిడి చేస్తున్నారే తప్ప ప్రజలకు పనులు చేయాలని చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బంధుల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ఇంకా ప్రజలు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మే ప్రసక్తిలో లేరని అన్నారు, మన ఊరు – మన ఉష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీని ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించి ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే నామినేషన్ వేయనున్నట్లు, ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, జిల్లా మహిళా కన్వీనర్ పూరేళ్ల స్వప్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంపల్లి బాబు, పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు బొంకురి దుర్గయ్య, ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్, శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి కుంట రవికుమార్, శ్రీరాంపూర్ గ్రామ మహిళా కన్వీనర్ కుమ్మరికుంట శారద, శ్రీరాంపూర్ మండల కోశాధికారి కోర్రే కిరణ్,సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్, సుల్తానాబాద్ కోశాధికారి అల్లెపు చంద్రశేఖర్, బివిఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, స్థానికులు ఏడేల్లి అశోక్ , వివిధ మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మల్లారపు రవిందర్, కార్యకర్తలు, మహిళలు, బివిఫ్ టీం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!